వీడియో కాన్పరెన్సింగ్, చాట్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ( Microsoft Teams ) సర్వీస్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) కు చెందిన ఈ సర్వీస్ గురువారం ఉదయం డౌన్ అయింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ (MS Teams)కు ఏమైందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఓ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ కూడా టీమ్స్ సర్వీస్ డౌన్ అయిన విషయాన్ని ధ్రువీకరించింది. దీనిపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందించింది.